క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం లభిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. శనివారం జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఖో-ఖో, వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. వేసవి క్రీడాశిక్షణ శిబిరాలను ఉపయోగించుకొని క్రీడల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa