కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లిలో ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న ధర్మ యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి అవ్వాలని భారతదేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రామాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరం ఇప్పుడు ఒక సైనికుల్లా పని చేయాలని ఏకతాటిపై నిలిచి దేశానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa