TG: రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నిర్మల్ మండలం నీలాయిపేట్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆదిలాబాద్‌లోని రవీంద్రనగర్‌కు చెందిన బండి శంకర్ (45) కుమార్తె కృతిక (20) HYDలో బీటెక్ చదువుతోంది. వేసవి సెలవులకు కుమార్తెను కారులో ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వీరి మృతితో కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa