కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్ ప్రాంతంలో శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద తలపెట్టిన ఈ సహాయ కార్యక్రమంలో సుభాష్ నగర్ డివిజన్‌కు చెందిన 130 మంది లబ్ధిదారులకు మంజూరైన మొత్తం రూ.3 లక్షల చెక్కులు అందజేయడం జరిగింది.
ఈ చెక్కులను పదిమంది లబ్ధిదారులకు చింతల్ ఎమ్మెల్యే కార్యాలయంలో పంపిణీ చేశారు. డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయగా, స్థానిక సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, ఇస్మాయిల్, శీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పేద, అవసరమైన వారికి సకాలంలో చేయూతగా నిలుస్తూ, మానవతా విలువలకు పెద్దపీట వేసే ఈ చర్య ప్రజల్లో అభినందన పొందింది. మిగతా లబ్ధిదారులకు త్వరలో చెక్కులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
![]() |
![]() |