మహబూబ్ నగర్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ మరియు దివ్యాంగ విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను కార్పొరేట్ ఇంటర్ కాలేజీల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
ఈ మేరకు శుక్రవారం అధికారులు ప్రకటన విడుదల చేశారు. పదవ తరగతిలో 400కు పైగా మార్కులు గానీ, లేదా కనీసం 7 జిపిఏ గానీ సాధించిన విద్యార్థులు ఈ అవకాశానికి అర్హులు.
అభ్యర్థులు మే 17 నుండి 31వ తేదీ వరకు ఈ-పాస్ వెబ్‌సైట్ (ePASS) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అధికారులు జూన్ 5న దరఖాస్తులను పరిశీలించి, జూన్ 10న ప్రవేశాలకు సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్లు జారీ చేయనున్నట్టు తెలిపారు.
విద్యలో ముందుండే ప్రతిభావంతులకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరింత సమాచారం కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa