తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ సందర్భంగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ విధించింది.
ఈ రోజు (మే 17, 2025) కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ పరిస్థితుల్లో రైతులు తమ పొలాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
రైతులు మరియు ప్రజలు వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండి, సురక్షిత చర్యలు చేపట్టాలని వాతావరణ శాఖ అధికారులు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa