మిస్ వరల్డ్ పోటీల కోసం భారత్‌కు వచ్చిన ప్రపంచ సుందరీమణులు శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్‌లోని ప్రఖ్యాత పిల్లలమర్రిని సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి వారిని ఆహ్వానించి సన్మానించారు. పిల్లలమర్రి యొక్క చారిత్రక, సాంస్కృతిక విశిష్టతను వారికి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, పర్ణికా రెడ్డి, వాకిటి శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావు తో పాటు పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. సుందరీమణుల సందర్శన జిల్లా పర్యాటక రంగానికి ప్రతిష్టను తెచ్చినట్లు నాయకులు అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa