మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని నాల్గవ వార్డులో గత మూడు రోజులుగా శ్రీమల్లికార్జున వీధి నాటకం ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమం చివరి రోజైన శుక్రవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి నాటకాన్ని తిలకించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, "పూర్వం గ్రామాల్లో రచ్చకట్ట వద్ద వీధి నాటకాలు ఘనంగా జరిగేవి. నేటి కంప్యూటర్ యుగంలో అంతరించిపోతున్న ఈ కళారూపానికి ఈ నాటకం ద్వారా జీవం పోశారు," అని ప్రశంసించారు. నాటక ప్రదర్శన కళాకారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ వీధి నాటకం స్థానికుల్లో సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించి, సాంప్రదాయ కళల పునరుజ్జీవనానికి దోహదపడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa