రాజ్యాంగ పరిరక్షణకు సంకేతంగా, ఖమ్మం నగరంలోని 50వ డివిజన్‌లో శనివారం “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” పేరుతో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేయర్ పునుకొల్లు నీరజ, కాంగ్రెస్ నగర అధ్యక్షులు ఎండీ జావిద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలలో రాజ్యాంగ విలువలపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని స్పష్టంగా తెలిపారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి మౌలిక హక్కులను కల్పిస్తుందని, వాటిని కాపాడుకోవాలన్నదే ఈ ఉద్యమ లక్ష్యమని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌ను వేదికగా చేసుకుని రాజ్యాంగాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తోందని వారు విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అలాంటి ప్రయత్నంలో భాగంగానే ఈ పాదయాత్ర చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa