హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్‌లో సంభవించిన అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో GHMC కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సీవీ ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మరియు TSSPDCL CMD ముషారఫ్‌లు సభ్యులుగా ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈ కమిటీకి క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa