హైదరాబాద్‌లో తగ్గించిన మెట్రో ఛార్జీలను శనివారం నుంచి అమలు చేయనున్నారు. సవరించిన మెట్రో ఛార్జీల కనీస ధర రూ.11, గరిష్ఠ ధర రూ.69. రెండు కి.మీ వరకు మెట్రో ఛార్జీని రూ.12 నుంచి రూ.11కు తగ్గించారు. 2 నుంచి 3 కి.మీ వరకు మెట్రో ఛార్జీ రూ.18 నుంచి రూ.17కు తగ్గించారు. 4 నుంచి 6 కి.మీ వరకు మెట్రో ఛార్జీని రూ.30 నుంచి రూ.28కి తగ్గించారు. 6 నుంచి 9 కి.మీ వరకు మెట్రో ఛార్జీ రూ.40 నుంచి రూ.37కి తగ్గింపు. 9 నుంచి 12 కి.మీ వరకు మెట్రో ఛార్జీ రూ.50 నుంచి రూ.47కి తగ్గింపు. 12 నుంచి 15 కి.మీ వరకు మెట్రో ఛార్జీ రూ.55 నుంచి రూ.51కి తగ్గింపు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa