కాంగ్రెస్ పార్టీ మరో పదేండ్లు అధికారంలో ఉండాలని చిన్నకోడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ అన్నారు. శనివారం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను చిన్నకోడూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షులు సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో పదేండ్ల అధికారంలో ఉండాలని అన్నారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రోగులకు పండ్లు, బ్రేడ్స్ పంపిణి చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa