లింగంపేట్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులు త్వరగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. శుక్రవారం ఫార్మీన్ బేగం ఇంటి నిర్మాణానికి ముగ్గుపోసి, మార్క్ అవుట్ ఇచ్చి, కొబ్బరికాయ కొట్టడం ద్వారా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు వేగంగా పూర్తి చేయాలని కోరారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుందని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa