బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ వెల్లడించినట్లు, ప్రజలకు మెరుగైన రక్షణ కల్పించేందుకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు గ్రామాల్లో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది.
ఆదివారం బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించబడింది. గురజాల ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది డాగ్ స్క్వాడ్‌తో కలిసి గ్రామంలో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ అఫ్జలుద్దీన్ మాట్లాడుతూ, గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములవ్వాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa