మిత్రదేశాలు తమను కేవలం సహాయం అర్థించే దేశంగా చూడటం లేదని.. వాణిజ్యం, పెట్టుబడులు, నూతన ఆవిష్కరణల్లో సమాన భాగస్వామిగా పరిగణిస్తున్నాయని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ "పాకిస్థాన్‌కు చైనా ఎప్పుడూ అండగా నిలిచే మిత్రదేశం. అలాగే సౌదీ అరేబియా, తుర్కియే, ఖతర్, యూఏఈ, అజర్‌బైజాన్ వంటి దేశాలు కూడా అత్యంత విశ్వసనీయమైన స్నేహితులు. ప్రస్తుతం ఈ దేశాలన్నీ మాతో వాణిజ్యం, ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో పరస్పరం కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాయి. మేము నిధుల కోసం ‘భిక్షాపాత్ర’తో వారి వద్దకు రావాలని వారు కోరుకోవడం లేదు" అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa