నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీవేణు గోపాలస్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా మంగళవారం గోడపత్రికను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఉత్సవం దేవాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఆహ్వానంగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa