ఆరోగ్యమే మహాభాగ్యమని నినాదంతో మేడ్చల్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షురాలు శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో యోగా శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. మంగళవారం నాడు అత్వెల్లి ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది.
ఈ సందర్భంగా శైలజ హరినాథ్ మాట్లాడుతూ, "మన పూర్వీకులు చెప్పినట్టు ఆరోగ్యం మనకు గొప్ప ఆస్తి. ఈ సూత్రాన్ని అనుసరించి ఇంటింటికీ, గడపగడపకూ యోగా తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించాం" అని పేర్కొన్నారు.
యోగా గురువుల సహకారంతో మూడు రోజుల పాటు ఈ శిక్షణ ఉచితంగా అందించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై యోగా తాలిమ పొందుతున్నారు. ప్రజల ఆరోగ్య సాధన కోసం ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని శైలజ హరినాథ్ ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa