ఢిల్లీ వేదికగా మంత్రుల శాఖల పై రేవంత్ స్పష్టత ఇచ్చారు. మూడు రోజులుగా రేవంత్ ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో మంత్రాంగం చేస్తున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ తరువాత చోటు చేసుకున్న పరిణామాలు.. పూర్తి స్థాయి ప్రక్షాళనతో పాటుగా.. స్థానిక సంస్థల వేళ కీలక అంశాల పైన చర్చలు జరుగుతున్నాయి. కులగణన విజయవంతం కావటంతో ఆ వివరాలను రేవంత్ పార్టీ నేతలతో పంచుకుంటున్నారు. ఇదే సమయంలో కవితకు కాంగ్రెస్ లోకి ఎంట్రీ లేదని తేల్చేసిన రేవంత్..కొత్త మంత్రుల శాఖల పైన అసలు విషయం వెల్లడించారు. మంత్రుల శాఖలు ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. మీడియా చిట్ చాట్ లో రేవంత్ పలు ఆసక్తి కర అంశాల పైన స్పందించారు. తన అభిప్రాయాలను వెల్లడించారు. కొత్తగా మంత్రులు అయిన ముగ్గురికీ తన వద్ద ఉన్న శాఖలనే కేటాయిస్తానని స్పష్టం చేసారు. సీనియర్ మంత్రుల శాఖల్లో ప్రస్తుతానికి మార్పులు లేవని చెప్పారు. ప్రస్తుతం తన వద్ద ఉన్న 11 శాఖల్లో కొన్నింటిని ముగ్గురు కొత్త మంత్రులకు ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ వద్దే హోం, మున్సిపల్, క్రీడలు, విద్యతో పాటు కీలకమైన 11 శాఖలు ఉన్నాయి. కాగా, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రుల శాఖల పైన ఇప్పటికే దాదాపు స్పష్టత వచ్చింది. ఈ రాత్రికి వీరికి శాఖల కేటాయింపు పైన అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. తాను ఢిల్లీకి వచ్చింది కర్ణాటక, తెలంగాణలో సక్సెస్ అయిన కులగణన వివరాలు పంచుకోవటానికేనని వెల్లడించారు. వారికి నో ఎంట్రీ నేను అధికారంలో ఉన్నంత వరకూ కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ లో నో ఎంట్రీ అని రేవంత్ తేల్చి చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులుగా పేర్కొన్నారు. కులగణన సమయంలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కిషన్ రెడ్డి అందరి నివాసాలకు ప్రత్యేకంగా వెళ్లి వివరాలు స్వీకరించాలని హైదరాబాద్ కలెక్టర్కు ప్రత్యేకంగా సూచించినట్లు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి, హరీష్ రావు సర్వేలో వివరాలు పంచుకోలేదన్నారు. కాళేశ్వరంలో ఏం జరిగిం దో.. కాళేశ్వరంపై తనకు ఉన్న అభిప్రాయాలను రెండు మూడు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తా నని రేవంత్ పేర్కొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు కూడా తీసు కురాలేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి ముందుకు వస్తే వారితో కలిసి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. నేను సిద్దం తెలంగాణ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డితో సమీక్ష చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపారు. ఏ రోజైనా తెలంగాణ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డి నివేదిక ఇచ్చారా కనీసం తెలంగాణకు ప్రాజెక్టు ఇవ్వాలని డిమాండ్ చేశారా అని ప్రశ్నించారు. నిర్మల సీతారామన్ చెన్నైకు మెట్రో తీసుకువెళ్లారని.. ప్రహ్లాద్ కర్ణాటకకు మెట్రో తీసుకెళ్లారని మరి తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏమీ తీసుకురాలేదని మండిపడ్డారు. తెలంగాణలో ప్రతీ అభివృద్ధి కార్యక్రమానికి కిషన్ రెడ్డి అడ్డుగా ఉన్నారన్నారు. తెలంగాణ మంత్రివర్గం విస్తరణలో సామాజిక న్యాయం పాటించామని.. 55 శాతం మేరకు ఇప్పటికే పదవులు కేయించామన్నారు. నక్సలిజానికి అంతం ఉండదని.. సామాజిక అసమానతలు ఉన్నంతవరకు నక్సలిజం ఉంటుందని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa