జగిత్యాల జిల్లా, పెగడపల్లి మండలంలోని అయితుపల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గురువారం గ్రామంలో జరిగిన పెద్దమ్మ బోనాల జాతర సందర్భంగా అన్నదమ్ములైన కూన నర్సయ్య (50), కూన రాములు మద్యం మత్తులో భూమి విషయంలో గొడవపడ్డారు. అర్ధరాత్రి జరిగిన ఈ వివాదంలో రాములు కర్రతో తన అన్న నర్సయ్య తలపై దాడి చేయడంతో నర్సయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.
మృతుడు నర్సయ్యకు భార్య, పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa