BRS MLA పల్లా రాజేశ్వర్ రెడ్డిని కేటీఆర్, ఇతర పార్టీ నాయకులు పరామర్శించారు. పల్లా వేగంగా కోలుకుని, త్వరలోనే తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. శస్త్ర చికిత్స అనంతరం తొందరగానే కోలుకుంటున్నట్లుగా కేటీఆర్‌తో పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కాగా, 2 రోజుల క్రితం ఎర్రవల్లి వ్యవసాయ క్షేతంలోని బాత్‌రూంలో జారిపడటంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎడమ కాలి తొడ ఎముక ఫ్రాక్చర్ అయిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa