ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పెరుగుతున్న ఫీజుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన.. రేవంత్‌రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 14, 2025, 02:51 PM

ఈ రోజుల్లో పిల్లల చదువుకు అయ్యే ఖర్చు అంతా ఇంతా కాదు. ఈ చదువులకు అంతంత ఫీజులు కట్టలేక పిల్లలను స్కూలు కాలేజీలకు పంపడమే మానేస్తున్నారు తల్లిదండ్రులు.ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలలో ఫీజులు ఇష్టానుసారంగా ఆయా యాజమాన్యాలు పెంచుకుంటు పోతుండటంతో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు విద్య అందకుండా పోతోంది. నాణ్యమైన విద్య సంగతి అటుంచితే అసలు అధిక ఫీజులతో విద్యార్థులను పాఠశాలలకు పంపాలంటేనే తల్లిదండ్రులు జంకుతున్నారు. దీంతో లిటరసీ రేటు తగ్గే అవకాశాలున్నాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుదామంటే అక్కడి పరిస్థితులు ఇంకా మెరుగుపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఫీజుల పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఫీజుల పెంపు ఇలాగే కొనసాగితే, కన్వీనర్‌ కోటా సీట్లలో కూడా విద్యార్థులు చేరడానికి వెనుకాడతారని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. శుక్రవారం విద్యాశాఖ అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ అంశంపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతీసారీ ఈ ఫీజు పెంపు ఏంటి..? శుక్రవారం విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న మూడేళ్ల (2025-26, 2026-27, 2027-28)కు ఇంజినీరింగ్‌ కళాశాలలకు కొత్త ఫీజుల ఖరారుపై రూపొందించిన నివేదికను అధికారులు సీఎంకు అందజేశారు. నివేదికను పరిశీలించిన సీఎం, ఫీజుల పెంపునకు గల కారణాలపై సూటి ప్రశ్నలు సంధించారు. "ఫీజుల పెంపునకు ప్రాతిపదిక ఏమిటి? ప్రతీసారీ ఎందుకు పెంచుకుంటున్నారు? వారు (కళాశాలలు) అందిస్తున్న విద్యా నాణ్యత ఎంత? నిబంధనలు పాటిస్తున్నారా.. లేదా?" అని నిలదీసినట్లు తెలిసింది.విద్యార్థులపై భారం పడకుండా, కళాశాలల నాణ్యతకు రాజీ పడకుండా ఫీజుల విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలనేది సీఎం ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ప్రైవేట్‌ పాఠశాలల ఫీజులపైనా చట్టం? సమీక్షలో ప్రైవేట్‌ పాఠశాలల ఫీజుల నియంత్రణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. దీనిపై అధికారులు మాట్లాడగా, ఇంజినీరింగ్‌ విద్య తరహాలోనే ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణపై కూడా ఒక సమగ్ర చట్టం రూపొందించాలని, దీనిపై లోతైన అధ్యయనం చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం. విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే ప్రభుత్వ ఆకాంక్ష దీని ద్వారా స్పష్టమవుతోంది.కేవలం ఆర్థిక అంశాలనే కాకుండా, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల అర్హతలు, ల్యాబ్స్, ప్లేస్‌మెంట్ రికార్డులు వంటి నాణ్యతా ప్రమాణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సీఎం ఈ సందర్భంగా సూచించినట్లు సమాచారం. గత ప్రభుత్వ నివేదికలు.. తీసుకున్న చర్యలు ఎక్కడ? ఈ సమీక్షలో ముఖ్యమంత్రి ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. గత ప్రభుత్వం 2016 విద్యా సంవత్సరంలో దాదాపు 40 విజిలెన్స్‌ బృందాలను ఇంజినీరింగ్ కళాశాలలకు పంపి, వారి రికార్డులను, వసతులను విస్తృతంగా తనిఖీ చేయించిందని సీఎం గుర్తుచేశారు. ఆ తనిఖీల నివేదికలు ఎక్కడున్నాయి, వాటిని అనుసరించి కళాశాలలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే వివరాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన తనిఖీల ఫలితాలను పరిశీలించడం ద్వారా ప్రస్తుత ఫీజుల ఖరారు ప్రక్రియకు మరింత పారదర్శకత, జవాబుదారీతనం వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రైవేట్‌ పాఠశాలల ఫీజులపైనా చట్టం? సమీక్షలో ప్రైవేట్‌ పాఠశాలల ఫీజుల నియంత్రణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. దీనిపై అధికారులు మాట్లాడగా, ఇంజినీరింగ్‌ విద్య తరహాలోనే ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణపై కూడా ఒక సమగ్ర చట్టం రూపొందించాలని, దీనిపై లోతైన అధ్యయనం చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం. విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే ప్రభుత్వ ఆకాంక్ష దీని ద్వారా స్పష్టమవుతోంది. నెల రోజులే గడువు.. గందరగోళంలో విద్యార్థులు! ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26)లో బీటెక్‌ సీట్ల భర్తీకి జులై మొదటి లేదా రెండో వారంలో కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. అంటే, ప్రభుత్వానికి ఇప్పుడు మిగిలింది కేవలం నెల రోజులు మాత్రమే. కౌన్సెలింగ్‌కు ముందే ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయాలి. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి మరింత లోతైన, శాస్త్రీయమైన అధ్యయనం చేయాలని ఆదేశించిన నేపథ్యంలో, ఈ కీలక ప్రక్రియ నెల రోజుల్లో పూర్తవుతుందా అనే సందేహాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా కొత్త ఫీజులను సకాలంలో ఖరారు చేయకపోవడంతో, తాత్కాలికంగా పాత ఫీజులనే వసూలు చేశారు. ఆ తర్వాత కొత్తవి ఖరారయ్యాక, అదనంగా వసూలు చేసుకునేందుకు కళాశాలలకు అనుమతిచ్చారు. ఈసారి కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారా, లేక ఈ విద్యా సంవత్సరానికి ఫీజుల పెంపును వాయిదా వేస్తారా అనేది స్పష్టం కావాల్సి ఉంది. వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని త్వరగా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa