కేసీఆర్ ముందు చూపుతో 5 మెడికల్ కాలేజీలను 35 మెడికల్ కాలేజీలకు పెంచుకున్నామని BRS నేత హరీశ్ రావు కొనియాడారు. తెలంగాణ నుండి ప్రతి సంవత్సరం 10,000 మంది డాక్టర్లు బయటకు వస్తున్నారని చెప్పారు. 'HYD 4 మూలల్లో 4 టిమ్స్ హాస్పిటళ్లను, వరంగల్‌లో హెల్త్ సిటీ పనులను కూడా ప్రారంభించాం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించి, ప్రతీ కాలేజీలో పీజీతో పాటు నర్సింగ్, ఫార్మసీ కాలేజ్ కూడా అనుసంధానం చేశాం' అని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa