ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఎదురుదెబ్బ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 12:46 PM

కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 
కమలాపురం మండలం వంగపల్లిలో గ్రానైట్‌ వ్యాపారి మనోజ్‌ క్వారీ నిర్వహిస్తున్నారు. ఈ క్వారీకి సంబంధించి రూ.50 లక్షలు ఇవ్వాలంటూ కౌశిక్‌రెడ్డి తమను బెదిరించారని మనోజ్‌ భార్య ఉమాదేవి ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సుబేదారి పోలీసులు కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. 
ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, తాజాగా ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa