తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ–ఫార్ములా కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ విచారణ ఊపందుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపితుడిగా (ఏ1) ఉన్న కేటీఆర్‌ను దేశం విడిచి వెళ్లకుండా ఏసీబీ ఆదేశించింది. అంతేకాక, ఫార్ములా రేసు సమయంలో ఉపయోగించిన ఫోన్లను జూన్ 18వ తేదీలోగా సమర్పించాలని కూడా స్పష్టం చేసింది. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతురాజ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం కేటీఆర్‌ను దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ విచారణలోసం డీఎస్పీ శర్మ, కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజీద్ అలీ ఖాన్‌తో కూడిన ఈ బృందం కీలక విషయాలపై లోతుగా ఆరా తీరింది. ఫార్ములా రేసు నిర్వహణలో జరిగిన ఆర్థక లావాదేవీలు, నిధుల వినియోగంపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
ఈ కేసు తదుపరి కీలక మలుపు తీరైన రాజకీయ పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేటీఆర్‌పై ఏసీబీ తీసుకున్న ఈ చర్యలు బీఆర్‌ఎస్‌కు సవాల్‌గా మారనున్నాయి. ఫోన్ల సమర్పణ, విచారణ ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa