మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలో రావల్ కోల్ గ్రామంలో మంగళవారం బీజేపీ నాయకులు హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్రంలో 11 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, సుపరిపాలన వారోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు ఎక్కల్ దేవి శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు పుష్ప మల్లారెడ్డి సహా పలువురు బీజేపీ నాయకులు హాజరయ్యారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల మొక్కలను నాటి, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రజలను కూడా మొక్కలు నాటేందుకు ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సుపరిపాలనను కొనియాడారు. గ్రామంలో హరితహారం కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలను మరింత ఉత్సాహంతో నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa