సినిమాల్లో వాహనాలు గాల్లోకి ఎగిరే సీన్లు చాలా కామన్‌గా కనిపిస్తుంటాయి. ఎదురుగా ఎంత పెద్ద అడ్డంకి ఉన్నా సరే.. రెయిజ్ చేశామంటే బండి గాల్లోకి లేచి.. ముందుకు దూకి.. దబ్బున కింద పడాల్సిందే. దానిలో ఉన్న వారు కూర్చున్న ప్లేస్ నుంచి ఇంచు కూడా కదలకుండా.. గాల్లోకి ఎగిరి.. భూమి మీదకు ల్యాండ్ అవుతారు. అది సినిమా కాబట్టి.. ఎలా చూపించినా సరిపోతుంది. కానీ నిజజీవితంలో ఇలా జరగదు కదా. ఒకవేళ రియల్‌గా వాహానాలు ఇలా గాల్లోకి లేస్తే ఏం జరుగుతుందో ఈ సీన్ చూస్తే మీకే అర్థం అవుతుంది.
పైన ఉన్న ఫోటో చూడగానే మీకు ఏం అనిపిస్తుంది.. లారీని రివర్స్ చేస్తుంటే.. వెనక పెద్ద కాల్వ అడ్డం వచ్చిందేమో అనిపిస్తుంది కదా. కానీ మీ ఆలోచన తప్పు. ఇక్కడ జరిగింది వేరే సీన్. వాస్తవానికి ఆ లారీ గాల్లోకి ఎగిరి.. కాల్వ దాటి.. అలా రోడ్డు మీద ల్యాండ్ అయ్యింది. సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి సీన్.. రియల్‌గా కళ్ల ముందు కనబడేసరికే అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామం సమీపంలో చోటు చేసుకుంది.
ఈ లారీ ఆదివారం రాత్రి మేళ్ల చెరువులోని ఓ సిమెంట్ కంపెనీ నుంచి లోడుతో బయలుదేరింది. అదే మార్గంలో మేళ్లచెరువు-కోదాడ మెయిన్ రోడ్డు మీద కందిబండ దగ్గర కొత్త బ్రిడ్జీ నిర్మిస్తున్నారు. దీంతో అక్కడ డైవర్షన్ ఏర్పాటు చేశారు. కానీ లారీ డ్రైవర్ అది గమనించుకోలేదు. పైగా రోడ్డుపై ఉన్న మట్టి కుప్పలను కూడా లెక్క చేయకుండా అలానే ముందుకు వెళ్లిపోయాడు. అప్పటి వరకు ఎలానో అలా వెళ్లాడు. కానీ అసలు సమస్య ఇప్పుడే ఎదురయ్యింది.
బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి కొంచెం వెనక ఓ చోట రోడ్డు తవ్వి కాల్వ చేశారు. పైనుంచి వచ్చే వాగు నీటిని మళ్లీంచేందుకు ఈ కాల్వ తవ్వారు. ఇదేమి చిన్న కాల్వ కాదు. 10 అడుగుల వెడల్పు, 25 అడుగుల లోతున ఈ కాల్వను తవ్వారు. అప్పటికే వేగంగా దూసుకువస్తోన్న లారీ డ్రైవర్ ఇక్కడ ఉన్న కాల్వను గుర్తించలేదు. వేగంగా వస్తున్న కారణంగా.. అక్కడ లారీని ఆపేందుకు అవకాశం కూడా లేదు.
దీంతో సదరు లారీ డ్రైవర్ అదే స్పీడుతో వాహనాన్ని ముందుకు లాగించేశాడు. ఇంకేముంది లారీ గాల్లోకి ఎగిరి.. కాల్వ దాటిన తర్వాత రోడ్డు మీదకు ల్యాండ్ అయ్యింది. చుట్టుపక్కల ఉన్న వారు ఈ సీన్ చూసి ఆశ్చర్యపోయారు. పైగా లారీ కాల్వలో పడుతుందేమో అని టెన్షన్ పడ్డారు. మొత్తానికి ఎలాంటి ప్రమాదం లేకుండా.. సెకన్ల వ్యవధిలోనే లారీ జాగ్రత్తగా రోడ్డు మీద ల్యాండ్ అయ్యింది.
కాకపోతే.. ఈ స్టంట్ వల్ల లారీ టైర్ల బేస్‌లు, డీజిల్ ట్యాంక్‌తో పాటుగా కమాన్ కట్టలు కూడా దెబ్బ తిన్నాయి. ఇక లారీ డ్రైవర్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఏది ఏమైనా సినిమాల్లో కనిపించే సీన్ ఇలా కళ్ల ముందు ప్రత్యక్షం అయ్యే సరికి అక్కడివారంతా షాక్ అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa