ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాలాష్టమి సందర్భంగా ఉప్పుగూడలో కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 19, 2025, 04:33 PM

ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలో, శ్రీ శివాలయం ప్రాంగణంలో గల శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో గురువారం ఉదయం 8 గంటలకు కాలాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజలలో భాగంగా, కాలభైరవ స్వామి వారికి అభిషేకం చేయగా, అనంతరం ఆయనను నూతన పసుపు వర్ణం వస్త్రము, గులాబీ పూలతో, రుద్రాక్ష మాలతో, నుదుటిలో చందనం, కుంకుమ తిలకంతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ ప్రత్యేక పూజలో బూడిద గుమ్మడికాయలతో దీపారాధన కూడా చేయడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa