రామచంద్రాపురం మండల పరిధిలో గల రేషన్ షాపులలో గత 20 రోజులుగా రేషన్ బియ్యం పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొంది. రేషన్ కార్డు లబ్ధిదారులు బియ్యంకోసం గంటల తరబడి బారులు తీరి అవస్థలు పడుతున్నారు. సోమవారం వరకు 4, 5 గంటలు వేచి ఉన్నా బియ్యం వస్తాయనే నమ్మకం లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. 3 నెలల బియ్యాన్ని ఒకేసారి ఇవ్వడం కూడా ప్రజలకు అసౌకర్యంగా ఉందని, ప్రతినెల బియ్యాన్ని నెలవారీగా పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa