వైన్‌షాప్‌లో మద్యం సేవిస్తున్న కొంతమంది యువకుల మధ్యన మాట మాట పెరిగి.. బీభత్సమైన ఘర్షణకు దారి తీసింది. ఏకంగా ప్రాణపాయ స్థితికి తెచ్చుకున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. రెండు గ్రామాలకు చెందిన యువకులు గ్రూపులుగా విడిపోయి ముష్ఠియుద్ధానికి దిగారు. పోలీసులు మధ్యలో కలుగుజేసుకొని ఆపే ప్రయత్నం చేసినా.. వినిపించుకోలేదు. దొరికినవాళ్లను దొరికినట్లు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa