యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని గజ్వేల్ ఏసీపీ నర్సింహులు అన్నారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాలు సందర్భంగా గజ్వెల్ పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ గంజాయి రహిత జిల్లాకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa