టేక్మాల్ రైతు వేదికలో 41 మంది లబ్ధిదారులకు 15 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మ రమేశ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు ఓ వరంలాంటిదని పేర్కొన్నారు. మండలంలోని నిరుపేదలు సీఎంఆర్ఎఫ్ నిధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాగర్, కిషోర్, పాపయ్య, సంగమేష్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa