ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తావిస్తున్న గోదావరి-బనకచర్ల ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు కనీస అవగాహన కూడా లేదని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ వస్తే తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో వివరించడానికి తాను సిద్ధమని హరీశ్ రావు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa