బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో బెల్ట్ షాపులను బంధు చేయించాలని బుధవారం గ్రామస్తులు అందరు తీర్మానించారు. గ్రామస్తుల తీర్మానం మేరకు గ్రామ పంచాయతీ సెక్రటరీ భరత్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో యువత మద్యానికి బానిస కాకుండా ఉండాలంటే బెల్ట్ షాపులను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుచున్నారు. మరియు మండల ఎక్స్చేంజ్ అధికారికి, జిల్లా కలెక్టర్ కి, స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా వినతిపత్రం ఇస్తున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa