గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఉప్పరపాలెం , సీతారామపురం గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. మండల ఏవో ఆర్. వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతు ప్రస్తుతం వరి విత్తనాలు రైతు సేవా కేంద్రాలలో 5 శాతం రాయితీ పై పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన BPT5204 MTU1224 విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం సబ్సిడీపై రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa