హైదరాబాద్ రాయదుర్గంలో దారుణ ఘటన జరిగింది. యూపీకి చెందిన సత్యప్రకాష్ (30) అనే వ్యక్తి ఓ మద్యం షాపు దగ్గర లిక్కర్ తీసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ అతన్ని మద్యం కోసం డబ్బులు కావాలని ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతి అడిగింది. ఈ క్రమంలో సత్యప్రకాష్ ఆమెకు మాయమాటలు చెప్పి, మద్యం తీసుకుని తన రూమ్ కి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa