కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొనడంతో గుర్తుతెలియని యువకుడు (30) అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం అర్ధరాత్రి కాచిగూడ-మలక్‌పేట స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడి ఒంటిపై లేత నీలిరంగు జీన్స్, నీలిరంగు చొక్కా ఉన్నాయి. ఎత్తు 5.5 ఫీట్లు. వివరాలకు 9573948545 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa