తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై కొద్దిరోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. పలువురు సీనియర్ నేతల పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ అధిష్ఠానం అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌రావును కొత్త అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయన పేరును ఖరారు చేస్తూ, వెంటనే నామినేషన్ దాఖలు చేయాలని పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రామచందర్‌రావు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తన నామినేషన్‌ను సమర్పించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa