చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధి న్యూ మారుతి నగర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ కుమారుడు ప్రణవ్ (22 ) కు గాయాలు కావడంతో వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను వ్యాపించకుండా అదుపు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa