భద్రాచలం వీఐపీ రోడ్డు ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రాంత ప్రజలు డ్రైనేజీ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీకి చెందిన డ్రైనేజీని పూడ్చి అక్రమంగా ఓ షాపును నిర్వహిస్తుండటంతో ఈ సమస్య తలెత్తినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీలో మట్టి పేరుకుపోయి మురుగునీరు నిల్వ ఉంటోంది. వర్షాకాలం కావడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa