పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆరవ డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ₹15 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం స్థానిక ప్రజల అభ్యర్థనకు అనుగుణంగా చేపట్టబడింది.
గతంలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగా ఈ రోడ్డుపనులు ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యితే వర్షాకాలంలో ఉండే మట్టిరోడ్ల వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయని స్థానికులు భావిస్తున్నారు. డివిజన్ ప్రజలు ఈ పనులపై హర్షం వ్యక్తం చేస్తూ అభివృద్ధికి మద్దతు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ జక్క వెంకట్రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొల్తూరి మహేష్‌లు పాల్గొన్నారు. వారిని స్థానికులు శాలువాలతో సత్కరించారు. ప్రజల సంక్షేమమే తనకు ప్రధానమైన లక్ష్యమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa