ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదని దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్.. సీఎస్ కె.రామకృష్ణ రావు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి టి.కె.శ్రీదేవిలకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు. మున్సిపాలిటీల్లో ఉండే భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించాలని హైకోర్టులో పిల్ దాఖలు చేసిన నారాయణపేటకు చెందిన వ్యక్తి. సంబంధిత శాఖలకు మరోసారి వినతి పత్రం ఇవ్వాలని పిటిషనర్‌ను కోరిన హైకోర్టు. పిటిషనర్ ఇచ్చిన వినతి పత్రంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ జనవరి 27వ తేదీన విచారణ ముగించిన హైకోర్టు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ప్రభుత్వం పట్ల పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్దీనిపై విచారణ జరిపి సీఎస్‌కు నోటీసులు జారీ చేస్తూ, విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు