మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో బేగంపేట డివిజన్ లోని బ్రాహ్మణ వాడికి చెందిన కొండమ్మ కు చికిత్స కోసం 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మంజూరైనది. గురువారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో ఆర్ధిక సహాయం మంజూరు పత్రం (LOC) ని కొండమ్మ కుమారుడు తరుణ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ టి. మహేశ్వరి, నాయకులు శ్రీహరి, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa