TG: జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌కు చెందిన కాటిపెల్లి నిత్య(21) హైదరాబాద్‌లోని KPHB కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటూ బీటెక్ 3rd ఇయర్ చదువుతోంది. ఇటీవల నిత్యను చదువులో వెనుకబడ్డావంటూ స్నేహితులు వైష్ణవి, సంజన అవమానించారు. దీంతో ఇంటికి వెళ్లిన నిత్య ఈ నెల 2న గడ్డి మందు తాగగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో వైష్ణవి, సంజనలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సదాకర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa