వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బందిలో అప్రమత్తత పెంచేందుకు అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే ఎలా స్పందించాలి, రోగులను ఎలా సురక్షితంగా తరలించాలి, ఎమర్జెన్సీ సిగ్నల్స్‌ను ఎలా వినియోగించాలి వంటి అంశాలపై ప్రాక్టికల్ డెమో ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa