గురు పౌర్ణమిని పురస్కరించుకొని 10వ తరగతి 2024-25 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన దేవరకద్ర ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల జిహెచ్ఎం నాగేంద్రమ్మను పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాగేంద్రమ్మ మాట్లాడుతూ ఈవిద్యా సంవత్సరం 10వ తరగతిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించి జిల్లా స్థాయిలో ప్రతిభను చాటుతామని అన్నారు. విద్యాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa