నిరుపేదలకు తాను అండగా ఉంటానని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. ఉట్నూర్ మండలంలోని ఘన్పూర్ గ్రామానికి చెందిన కోవ శ్యామల తల్లిదండ్రులను కోల్పోయారు. ఆరోగ్య పరిస్థితులు బాగా లేకపోవడంతో శ్యామల శుక్రవారం ఉట్నూరులో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు ఎమ్మెల్యే బొజ్జు ఫౌండేషన్ ద్వారా రూ. పదివేల ఆర్థిక సహాయం అందజేశారు. నిరుపేదలకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa