హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ వృద్ధురాలు ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసానికి గురైంది. ఇన్‌స్టాలో ఎఫ్‌ఎక్స్ రోడ్ పేరుతో వల వేసిన మోసగాళ్లు, విడతలవారీగా మొత్తం రూ.57.43 లక్షలు కాజేశారు. బాధితురాలికి నమ్మకం కలిగించేందుకు తొలుత లాభాలు చూపించారు. బాధితురాలు నమ్మి రూ.57.43 లక్షలు పెట్టుబడి పెట్టింది. ఆ తర్వాత లాభాలు గానీ, విత్‌డ్రా గానీ చేసుకునే అవకాశం కల్పించలేదు. దీంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa