నల్గొండ జిల్లా చందంపేట పోలీసులు బుధవారం ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. వాహన తనిఖీల్లో బైక్‌పై అనుమానాస్పదంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకొని వేలిముద్రల ద్వారా గుర్తించారు. వీరు శాంసన్, కృష్ణ కిషోర్ . జైల్లో పరిచయమైన వీరు బయటికి వచ్చాక కలిసి దొంగతనాలకు పాల్పడ్డారు. వీరి వద్ద నుంచి రూ.12 లక్షల బంగారు ఆభరణాలు, వెండి, నగదు, ఫోన్లు, బైకులు స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa