తెలంగాణలో ఇంజినీరింగ్ కళాశాలల బీ కేటగిరీ సీట్ల భర్తీ ప్రక్రియ జూలై 19 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 10లోగా ప్రవేశాలు పూర్తి చేయాలని ఉన్నత విద్యామండలి పేర్కొంది. కన్వీనర్ కోటా కింద 70% సీట్లను ప్రభుత్వం కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన 30 శాతాన్ని బీ కేటగిరీగా పిలుస్తారు. రాష్ట్రంలో గత ఏడాది సుమారు 28 వేల మంది బీ కేటగిరీ ప్రవేశాలు పొందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa