TG: వనపర్తి జిల్లాలోని పెబ్బేరు పట్టణంలో ఒక భయానక ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న యువకుడి పరుపులోకి ఏడడుగుల కొండచిలువ దూరింది. సోమవారం తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో కుక్కలు అకస్మాత్తుగా అరవడం మొదలుపెట్టాయి. దీంతో నిద్రలేచిన చెన్నకేశవులు, తన పరుపులో కొండచిలువను చూసి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే పాములను పట్టే వ్యక్తిని పిలిపించి, 15 కిలోల బరువున్న ఈ కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa